విభజన రాజకీయాలతో హీటెక్కిన ఢిల్లీ

telanవిభజన రాజకీయాలతో ఢిల్లీ హీటెక్కిపోతోంది. రాష్ట్ర నేతలందరూ ఒక్కొక్కరే ఢిల్లీకి క్యూ కడుతున్నారు. కేంద్ర నేతలను కలిసి వస్తున్నారు. బిల్లుకు మద్దతు కూడగట్టుకునే పనిలో టీవాదులు ఉంటే ఎలాగైనా బిల్లును అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు లాబీయింగులు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రణబ్ లను కలవనున్నారు. ఉదయం పదిగంటలకు కేసీఆర్ ప్రధానిని కలవనున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. మరోవైపు 11.50 కి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన వార్ రూమ్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం మధ్యాహ్నం ఒంటిగంటకు ఏపీ భవన్ లో సీమాంధ్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటలకు జీవోఎం భేటీకానుంది. టీ బిల్లులో సవరణలపై జీవోఎంలోని మంత్రుల బృందం చర్చించనుంది. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమవనుంది.

మరోవైపు స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో  రేపటి నుంచి మొదలవబోయే పార్లమెంటు సమావేశాలపై ఆల్ పార్టీ మీట్ జరగనుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు బీజేపీ నేతలను మీటింగ్ లతో చుట్టేయనున్నారు. 11 గంటలకు అద్వానీని కలుస్తున్న చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు సుష్మాస్వరాజ్ ను కలుస్తారు. ఆఖరుగా వైసీపీ అధినేత జగన్ సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారని సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy