ముదిరిన డీఎంకే సంక్షోభం

dmk2

డీఎంకేలో ఆధిపత్య పోరు హత్యలు చేసుకునే వరకూ వెళ్లింది. తండ్రి రాజకీయ వారసత్వం  కోసం కత్తులు దూసుకుంటున్న స్టాలిన్ , అళగిరి బ్రదర్స్  వ్యవహారం హద్దులు దాటి పోయింది. సాక్షాత్తు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధే ఈ విషయాన్ని బయటపెట్టారు.  పార్టీ నుంచి అళగిరి సస్పెన్షన్ కు కారణమం ఇదేనంటూ  లోగుట్టును బయటపెట్టారు కరుణ. ఈ నెల 24న  ఉదయం అళగిరి తన ఇంటికొచ్చి పరుష పదజాలంతో స్టాలిన్ ని దూషించినట్లు తెలిపారు కరుణ. మూడు నెలల్లో స్టాలిన్ ఖతమవుతాడని హెచ్చరించాడనీ … కన్నకొడుకుపై ఇలాంటి వ్యాఖ్యలు తండ్రిగా భరించలేక పోయానన్నారు. స్టాలిన్ పై అళగిరికి ఏదో తెలియని విద్వేషం ఉందంటూనే తప్పనిసరి పరిస్థితి వల్లే పెద్దకొడుకును పార్టీ నుంచి బయటకు పంపించాల్సి వచ్చిందని  చెప్పుకొచ్చారు. డీఎండీకేతో  పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయంపై మధురైలో మీడియాతో మాట్లాడటం గందరగోళానికి దారితీసిందన్నారు. అళగిరిని సస్పెండ్ చేయడం పార్టీ నిర్ణయమన్నారు.ఒక వేళ క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తేసే విషయం ఆలోచిస్తామన్నారు. 2009లో కాంగ్రెస్ డీఎంకే పొత్తు పెట్టుకోవడంతో అళగిరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కొంతకాలనికి  డీఎంకే  అధిష్టానం ఆయనతో రాజీనామా చేయించింది. దీన వెనుక స్టాలిన్ హస్తం ఉందని  భావించిన అళగిరి తమ్ముడిపై మరింత ద్వేషం పెంచుకున్నారని వెల్లడించారు కరుణ.

అయితే కరుణ వ్యాఖ్యలపై ఒంటికాలిపై లేచారు అళగిరి. తన తండ్రి  నిరాధారఆరోపణలు చేస్తున్నారని కన్నీళ్ల పర్యంతమయ్యారు.  పార్టీ అధ్యక్షుడిగా తన తండ్రి  నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy