D/O ఛాయ్ వాలా : ఇండియన్ క్రికెట్ లో సంచలనం

ekthaఏక్తా బిష్త్.. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద భారత్ ను ఏక్తా బిష్త్ గెలిపించడంతో… ఆమె పేరు చాలామందికి తెలిసింది. స్పిన్ అండ్ ఫాస్ట్ తో సరికొత్త స్టైల్లో బ్యాట్స్ విమెన్ ను బోల్తా కొట్టించేలా బౌలింగ్ చేసి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటోంది ఈ ఉత్తరాఖండ్ అమ్మాయి. ఎంతమంది మహిళా స్పిన్నర్లు ఉన్నా…. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చేసే మ్యాజిక్ వేరు. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన ఏక్తా బిష్త్ .. ఆటలో ఎదిగిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉంటే… తెలిసిన వాళ్లు రెఫర్ చేస్తే అవకాశాలు అందుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ.. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. టాలెంట్ నే నమ్ముకుని ఇప్పుడు స్టార్ గా మారింది ఏక్తా. ఓ చాయ్ వాలా కుటుంబం నుంచి వచ్చిన ఏక్తా.. క్రికెట్ లో స్టార్ బౌలర్ గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. భారత సైన్యం నుంచి రిటైర్ అయ్యాక… వచ్చే 15వందల పెన్షన్ సరిపోక…. ఏక్తా తండ్రి కుందన్ తన కుటుంబం కోసం ఓ చాయ్ దుకాణం పెట్టాడు. ఉత్తరాఖండ్ లోని అల్మోరాలో దాదాపు పదేళ్ల పాటు ఆయన టీ షాప్ నడిపాడు. కుందన్ కు ఏక్తా బిష్త్ తో పాటు… మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నప్పటినుంచే ఏక్తా.. క్రికెట్ అంటే ఇష్టం చూపించడంతో… కుటుంబ సభ్యులు ఎంకరేజ్ చేశారు. టీ షాప్ నడిపితే వచ్చే డబ్బుతోనే ఏక్తాకు ఆమె తండ్రి క్రికెట్ కిట్లు కొనిచ్చాడు. ప్రొఫెషనల్స్ తో కోచింగ్ ఇప్పించాడు. మహిళా క్రికెట్ కు ఆదరణ పెరుగుతూ రావడంతో… ఆ రంగంలోనే ప్రోత్సాహించారు. అబ్బాయిలతో క్రికెట్ ఆడి… ఈ రంగంల్లో మరింత పట్టును సంపాదించింది ఏక్తా.

2006లో యూపీ జట్టుకు ఎంపికైంది. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి… 2011 లో మొట్టమొదాలు భారతజట్టు తరపున ఆడింది ఏక్తా. లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బౌలింగ్ చేయడం.. ఫ్లయిటెడ్ డెలివరీలు విసరడం ఏక్తా బలాలు. ఇప్పటివరకు ఆమె తీసిన వికెట్లల్లో ఎక్కువ శాతం బౌల్డులు.. ఎల్బీడబ్ల్యూలే ఉండటం.. ఏక్తా బౌలింగ్ లో ఖచ్చితత్వం ఎంతో చెప్పకనే చెప్తాయ్. 2012లో కొలంబోలో జరిగిన మహిళల ప్రపంచకప్ ఫస్ట్ టైమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది ఏక్తా బిష్త్. ఏ ఫార్మాట్ లో అయినా ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టిన భారత మహిళా బౌలర్ గా రికార్డుల్లోకెక్కింది. రీసెంట్ గా పాకిస్థాన్ మీద ఐదు వికెట్ల ప్రదర్శనతో కెరీర్ బెస్ట్ గణాంకాలు రికార్డు చేసింది. ఎప్పటికైనా దేశం గర్వించదగ్గర ఆట ఆడుతుందనుకున్న ఏక్తా బిష్త్.. ఇప్పుడు తమ కలను నిజం చేసిందని అని మురిసిపోతున్నారు ఆ మధ్యతరగతి కుటుంబం.

అప్పట్లో ఛాయ్ అమ్మిన ఆ కుటుంబం .. తమకు సైనిక పెన్షన్ పెరగడంతో… ఆ వ్యాపారం ఆపేసింది. ఇప్పుడు కూతురు స్టార్ క్రికెటర్ అయ్యేసరికి.. ఆ ఛాయ్ వాలా కుటుంబం తమ కష్టాలన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy