మొబైల్ యాప్ లోనే డాక్టర్ కన్సల్టెన్సీ

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఆధారిత ఆన్ డిమాండ్ హెల్త్ కేర్ సంస్థ ఎంఫైన్ హైదరాబాద్ లో మరో 7 హాస్పిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఫైన్ యాప్ ద్వారా ఆన్ లైన్ లోనే డాక్టర్ తో మాట్లాడచ్చని ఎంఫైన్ కో ఫౌండర్ & సీఈవో ప్రసాద్ కొంపల్లి తెలిపారు. మెసేజ్, వీడియో, ఆడియో కాల్స్ ద్వారా డాక్టర్ ను సంప్రదించవచ్చని వెల్లడించారు.

హైదరాబాద్ లో సేవలు ప్రారంభించిన 3 నెలల్లోనే మూడింతల వృధ్ది సాధించామని, దాదాపు 100 మంది డాక్టర్ల కన్సల్టేషన్ కోసం 5 వేలమంది ఎంఫైన్ సేవలను వినియోగించుకున్నారని అన్నారు. ప్రస్తుతం నెలకు దేశవ్యాప్తంగా రోజుకు 12 వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతుండగా, మరో మూడేళ్లలో ఈ సంఖ్య 40 వేలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వెయ్యి హాస్పిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకుని, 10 వేల మంది డాక్టర్లను ఎంఫైన్ యాప్ లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy