ECIL నుంచి సెకండ్ లార్జెస్ట్ టెలిస్కోప్..!

gamma-rays-telescope.2హైదరాబాద్ లోని ECIL దేశానికి అతిపెద్ద టెలిస్కోప్ ను కానుకగా ఇవ్వనుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద గామా టెలిస్కోప్ ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తోంది. మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెంకొవ్ ఎక్స్పరిమెంట్ (మేస్) గామా రే టెలిస్కోప్ ను త్వరలోనే జమ్మూ-కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతానికి తరలించనున్నారు. 180 టన్నుల ఈ టెలిస్కోప్ ను బాబా ఆటమిక్ రీసెర్చ్ (ముంబయి) కోసం ECIL తయారు చేసింది. దీని డిజైన్, డెవలపింగ్, మ్యానిఫాక్చరింగ్ క్రెడిటంతా ECIL కే చెందుతుంది. మేస్ ఇప్పటికే అన్ని రకాల టెస్టుల్లో పాసయ్యింది. త్వరలోనే లఢక్ ప్రాంతంలోని హాన్లే సైట్ కు దీన్ని పంపించనున్నారు. జూన్ 28న ఆటమిక్ ఎనర్జీ ఛైర్మన్ డా.ఆర్.కె.సిన్హా ఈ టెలిస్కోప్ ను ప్రారంభిస్తారు. ఈ టెలిస్కోప్ ఆస్ట్రోఫిసిక్స్, ఫండమెంటల్ ఫిజిక్స్, ఆర్టికల్స్ యాక్జిలరేషన్(వస్తువుల త్వరణం) వంటి వాటిపై పనిచేస్తుంది. దీని డయామీటర్ 21 మీటర్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా టెలిస్కోప్ గా నిలిచిపోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గామా టెలిస్కోప్ ‘హెస్’ నమీబియాలో ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy