ESI మెడికల్ కాలేజీల్లో కార్మికుల పిల్లలకు 40శాతం

ESIహైదరాబాద్  సనత్ నగర్ లో నిర్మిస్తున్న ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు మంచి అవకాశం ఇచ్చింది కేంద్రం. కాలేజీలోని ఎంబీబీఎస్  సీట్లలో 40 శాతం ఈఎస్ఐ యాజమాన్య కోటా కింద కార్మికుల పిల్లలకు దక్కనున్నాయి. అఖిల భారత వైద్య కళాశాలల ప్రవేశ పరీక్ష  రాసిన వారే  ఈ సీట్లు పొందే అవకాశం ఉంది.  దేశంలో ఈ విధానం మూడేళ్లుగా అమల్లో ఉంది. అయితే రాష్ట్ర కార్మికులకు ఈ అవకాశం ఫస్ట్ టైమ్  దక్కనుంది.  దేశంలో బెంగళూరు, కలబురగి, చెన్నై, కోల్ కతా, హరియాణాలలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ఒక్కరికి సీటు రాలేదు.  ప్రస్తుతం రాష్ట్రంలోనే కాలేజీ ఉండటంతో  అవకాశాలు  పొందవచ్చంటున్నారు కార్మికశాఖ అధికారులు. ఈఎస్ ఐ మెడికల్ కాలేజీలో అడ్మీషన్ పొందాలంటే జనవరి ఒకటి నాటికి ఐదేళ్లుగా కార్మికుడిగా పని చేస్తుండాలి.  ఆరు నెలల్లో కనీసం 78 రోజుల పాటు పరిశ్రమలో పనిచేసి ఉండాలి. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ను ఈఎస్ ఐ రీజినల్ ఆఫీసు నుంచి తీసుకోవాలి. దీంతో పాటు విద్యార్హతలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల, వికలాంగుల ధ్రువీకరణపత్రాలనూ సమర్పించాలి. 21 ఏళ్లలోపు వారికే అవకాశం ఉంటుంది. అఖిలభారత వైద్యప్రవేశాల పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ప్రతిభ ప్రాతిపదికన కౌన్సెలింగ్ లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. చదువు ముగిసిన తర్వాత ఈఎస్ ఐ ఆసుపత్రుల్లో పనిచేయాలి. గ్రామీణ సర్వీసులో పనిచేసేందుకు ముందుకొస్తే అవకాశమిస్తారు. అభ్యర్థులు  ఏటా 24వేల రూపాయల ఫీజు చెల్లించాలి. స్కాలర్షిప్పులు కూడా ఉంటాయి. ఈ స్కీమ్ గురించి కార్మికులకు పెద్దగా తెలియకపోవడంతో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. 200 సీట్లుంటే గతేడాది కేవలం 50 మంది మాత్రమే సీట్లు పొందారు. మిగిలిన సీట్లను జనరల్  కేటగిరీకి మార్చి భర్తీ చేశారు.  దీనిపై విద్యార్థులకు శిక్షణ, సీట్ల భర్తీపై అవగాహన కల్పిస్తామంటున్నారు కార్మిక శాఖ అధికారులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy