EVM ట్యాంపరింగ్ పై దుమారం.. చర్యలు చేపట్టిన ఈసీ

 ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించి లండన్ లో జరిగిన కార్యక్రమానికి హాజరవ్వడంపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. ఆ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను కూడా ఆహ్వానించినట్టు నిర్వాహకులు తనకు ఈ మెయిల్ చేశారని సిబల్ చెప్పారు. అలాగే.. ఈవీఎంలు హ్యాక్ చేసిన టీంలో ఉన్న వ్యక్తుల వివరాలు, వారు ఎక్కడ పనిచేశారో కూడా తనకు మెయిల్ చేశారని సిబల్ చెప్పారు. హైదరాబాద్  సనత్ నగర్ లో ఉన్న ECIL కార్యాలయంలో వారు పనిచేశారని వివరించారు.

కౌంటరిచ్చిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్..
కాంగ్రెస్ ఆరోపణలకు  కౌంటరిచ్చారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ డైరెక్షన్ లోనే లండన్ హ్యాకథాన్ జరిగిందని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి:
ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూలో తన పేరు రావడంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. తనకు ఈవీఎం ట్యాంపరింగ్ తెలిసి ఉంటే..  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడినన్నారు. తమకు మెషిన్లను హ్యాక్ చేయడం తెలిస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు.

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఆరోపణలు చేసిన సయీద్ షుజాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లెటర్ రాసింది. అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని.. ఈ ఇష్యూపై పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది.

సయీద్ షుజా ఆరోపణలను ECIL ఖండించింది. అతడు తమ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేయలేదని.. తాము సేవలు పొందుతున్న ఇతర సంస్థల్లో కూడా పనిచేయలేదని ప్రకటించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy