FDIకి కొత్త అర్ధం చెప్పిన ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ FDIకి కొత్త అర్ధం చెప్పారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్  అంటూ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు ప్రధాని మోడీ ‘మేక్ ఇన్ ఇండియా’ క్యాంపైన్ ను స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కు కేంద్ర మంత్రులతో సహా పలు కంపెనీలకు చెందిన సీఈవోలు వచ్చారు.  ఈ మీటింగ్ లోనే మోడీ ఎఫ్డీఐకు కొత్త మీనింగ్ చెప్పారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’  అంటూ సరికొత్త అర్ధం చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన ఈ మీటింగ్ తో ఇండియాలో కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెప్తుంది. ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూసే రోజులు వచ్చాయని మోడీ అన్నారు. ఇండియా టాలెంట్ ఏంటో మంగళయాన్ నిరూపించిందని ప్రధాని చెప్పారు. ఏ కంపెనీని కూడా ఇండియా దాటి బయటకు వెళ్లకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలు కల్పించి ప్రొత్సహిస్తామన్నారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy