Forbes అత్యంత ప్రతిభావంతుల లిస్టులో తెలుగు వారు

raghu-chivukula_170x170

Forbes పత్రిక ప్రచురించే ప్రపంచ ధనవంతుల లిస్టే అందరికీ తెలిసింది. కానీ వారు అనేక రంగాలలో గుర్తించదగ్గ వ్యక్తుల వివరాలు కూడా ప్రకటిస్తుంటారు. అలా ఆ పత్రిక ఈ మధ్యే 30 సంవత్సరాలలోపే ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభావంతుల లిస్టు కూడా ప్రకటించింది. మీడియా, టెక్నాలజీ, మెడిసిన్, సేవ… ఇలా పలు రంగాలలో ఇలాంటి వారి వివరాలు విశ్లేషించింది Forbes. అలాంటి లిస్టుల్లో ఏకంగా 23 మంది భారతీయులకు చోటు దక్కగా వారిలో మెడిసిన్ రంగంలో స్థానం దక్కించుకున్నాడు తెలుగువాడైన  “రఘు రాం చివుకుల” (29) అనే యువ శాస్త్రవేత్త. బాల్టిమోర్, అమెరికా లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో పరిశోధనచేసి, మస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ గా ఉన్న రఘు రాం  మైక్రో RNA ల పని తీరు గురించి చేసిన పరిశోధన, కాలేయ కాన్సర్ మందు కనిపెట్టడంలో ఈయన జరుపుతున్న కృషి గొప్పదిగా వర్ణించిన Forbes ఈ లిస్టులో ఏడో స్థానం కల్పించింది.

ganesh-betanabhatla-under30_170x170

తలారా కాపిటల్ అనే ఇన్వెస్ట్మెంట్ సంస్థ MD గా ఉన్న గణేష్ బేతనభట్ల (28)అనే పెట్టుబడుల రంగ నిపుణుడు కూడా ఇలాంటి లిస్టులో నిలిచాడు.

లిస్టులో వివిధ రంగాలలో ఇతర భారతీయులు దివ్యా నాగ్, సురభి సార్నా, రుశభ్ దోషీ, చైతన్య మెహ్రా, వివేక్ రామస్వామి, సయమిందు దాస్ గుప్తా, సాద్ రిజ్వీ, అదితీ మల్హోత్రా, కృష్ణా రాం కుమార్, కవితా శుక్లా, అజైతా షా తదితరులు ఉన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy