నేను IPSగా ఉండను… అలోక్ వర్మ రాజీనామా

సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ తన సర్వీసుకు రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీబీఐ డైరెక్టర్ గా జనవరి 9న బాధ్యతలు తీసుకున్నారు అలోక్ వర్మ. వచ్చీరాగానే పలు బదిలీలు చేశారు. ఐతే.. సీబీఐ బాధ్యతల నుంచి అలోక్ వర్మను తప్పిస్తూ ఆ మరునాడే ప్రధాని మోడీ నాయకత్వంలోని హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత..  కేంద్రప్రభుత్వం అలోక్ వర్మను…  ఫైర్ సర్వీస్ డీజీగా బదిలీ చేసింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావు శుక్రవారం రాత్రి మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అలోక్ వర్మ చేసిన బదిలీలను నిలిపివేశారు. ఫైర్ సర్వీస్ డీజీగా బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించిన అలోక్ వర్మ..  తన ఐపీఎస్ సర్వీస్ కు రాజీనామా చేశారు. రిజిగ్నేషన్ లెటర్ ను “సిబ్బంది -శిక్షణ శాఖ” కార్యదర్శికి పంపించారు.

రాజీనామా సందర్భంగా ఓ స్టేట్ మెంట్ ను అలోక్ వర్మ విడుదల చేశారు. ‘సాధారణంగా జరగాల్సిన న్యాయం జరగలేదు. అంతా తలకిందులు చేసి డైరెక్టర్ పదవినుంచి తొలగించారు. జులై 31,2017 నాటికే పదవీకాలం పూర్తయ్యింది. ఆ తర్వాత కూడా సీబీఐ డైరెక్టర్ పదవిలో కేంద్రానికి సర్వీస్ చేశాను. సీనియారిటీ వయసు దాటినందున… డీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ కీలక పదవులు తీసుకోలేను. అందుకే.. మొత్తం సర్వీసునుంచి వైదొలగాలని భావిస్తున్నా’  అని లేఖరో రాశారు అలోక్ వర్మ.

గత కొంత కాలంగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ ఆస్థానాకు, అలోక్ వర్మ కు విభేదాలు తలెత్తడంతో సీబీఐ రెండు వర్గాలుగా విడిపోయింది. 2018 అక్టోబర్ 23న ఇద్దరు అధికారులను కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపించింది. తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావును నియమించింది.

తన బదిలీ అక్రమం అంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బదిలీ నిర్ణయాన్ని సుప్రీం తప్పుపట్టింది. దీంతో తిరిగి సీబీఐ చీఫ్ గా అలోక్ వర్మ గురువారం భాద్యతలు తీసుకున్నారు. ప్రధాని మోడీ, లోక్ సభ ప్రతి పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ.. ప్యానల్ చర్చించి సీబీఐ బాధ్యతలనుంచి అలోక్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలోక్ వర్మను గురువారం ఫైర్ సర్వీస్ డీజీగా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వరుస పరిణామాల తర్వాత… అలోక్ వర్మ తన సర్వీసుకు రిజైన్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy