ఇక మ్యాథ్స్ ఈజీగా పాసైపోవచ్చు: 10th విద్యార్థులకు CBSE శుభవార్త

న్యూఢిల్లీ: మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రిలీఫ్ ఇది. ఇక పిల్లల లెక్కల పుస్తకాలతో పేరెంట్స్ కుస్తీ పట్టక్కర్లేదు. మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే పిల్లలకు చలి జ్వరం అసలేరాదు. CBSE తీసుకున్న ఈ నిర్ణయంతో అందరూ ఫ్రీ అయిపోవచ్చు. అసలా నిర్ణయం ఎంటంటే.. 10th క్లాస్ మ్యాథ్స్ ను రెండు లెవల్స్ గా డివైడ్ చేసింది సీబీఎస్ఈ. రెండింటిలో ఏ లెవల్లో  పరీక్ష రాయాలో నిర్ణయం స్టూడెంట్స్ ఇష్టం. లెవల్-1 పరీక్ష ఇంతకు ముందులానే ఉంటుంది. లెవల్-2 మాత్రం ఈజీగా ఉంటుంది. అయితే సిలబస్ ఏ మాత్రం మార్చడం లేదు. ఏ లెవల్ సెలక్ట్ చేసుకున్నా టీచర్లు మొత్తం సిలబస్ చెబుతారు. లెవల్-2 వారికి పరీక్ష మాత్రం ఈజీగా ఉంటుంది. ఈ రూల్ ఫైనల్ ఎగ్జామ్ కే కాదు.. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కు కూడా ఉంటుంది. స్కూల్ లోని విద్యార్థులు ఏ లెవల్ సెలక్ట్ చేసుకున్నారన్న లిస్ట్ హెచ్ ఎం/ప్రిన్సిపాల్ డీటైల్డ్ గా బోర్డుకు వివరిస్తారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ కొత్త రూల్ వచ్చే సంవత్సరం (2020) నుంచి అమలులోకి వస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy