FTII చైర్మన్ గా అనుపమ్ ఖేర్

Indian Bollywood actor Anupam Kher announces season 2 of his show The Anupam Kher Show - Kucch Bhi Ho Sakta Hai' in Mumbai late on July 21, 2015. AFP PHOTO        (Photo credit should read STR/AFP/Getty Images)

Indian Bollywood actor Anupam Kher announces season 2 of his show The Anupam Kher Show – Kucch Bhi Ho Sakta Hai’ in Mumbai late on July 21, 2015. AFP PHOTO (Photo credit should read STR/AFP/Getty Images)

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ ఇన్‌స్టిట్యూట్ పుణెలో ఉంది. ఇప్పటివరకు ఆ పదవిలో టెలివిజన్ నటుడు గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్ చైర్మన్ అయ్యారు. బాలీవుడ్‌లో 500కుపైగా సినిమాల్లో ఆయన నటించారు. గతంలో అనుపమ్ సీబీఎఫ్‌సీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్లుగానూ వ్యవహరించారు. సినిమా, ఆర్ట్స్‌కు ఆయన అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ, 2016లో పద్మ భూషణ్‌తో అనుపమ్ ఖేర్‌ను సత్కరించింది. ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న గజేంద్ర చౌహాన్‌కు వ్యతిరేకంగా గతేడాది ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు 139 రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. ఆయన నియామకం రాజకీయ ప్రేరేపితం అంటూ విద్యార్థులు గజేంద్ర చౌహాన్‌ను వ్యతిరేకించారు. ఈ ఏడాది మార్చిలో ఆయన పదవి నుంచి దిగిపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy