GHMCలోనే అడ్డా : ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

fake ghmcచిటికెలో బర్త్ సర్టిఫికెట్ చేతిలో పెడతారు. ఏ తేదీ కావాలంటే అది వేస్తారు.. మీ ఇష్టం వచ్చిన ఊరు పెట్టుకోవచ్చు.. మీకు ఎలా కావాలంటే అలా బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు. జస్ట్ ఐదు నిమిషాల్లోనే. ఇది సర్కార్ స్కీమ్ కాదు. దొంగల ముఠా ప్రచారం. రూ.5 వేలు చేతిలో పెడితే చాలు ఎలాంటి బర్త్ సర్టిఫికెట్ అయినా సృష్టించేస్తున్నారు. ఇది కూడా GHMC ఆఫీస్ లోనే జరగటం విశేషం. ఈ బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు.

ఎక్కడ పుట్టారో సర్టిఫికెట్ ఇచ్చే పలు ఆసుపత్రుల హెల్త్ అసిస్టెంట్స్, మీ-సేవ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వరకు అందరూ తోడు దొంగలే. కొంతకాలంగా ఈ వ్యవహారంతో లక్షలు కొట్టేసింది. డెకాయ్ ఆపరేషన్ తో పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఫేక్ గ్యాంగ్ పై కన్నేసిన SO టీమ్.. 13 మందిని అదుపులోకి తీసుకుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియకు వెల్లడించారు.

నకిలీ బర్త్ సర్టిఫికెట్ కావాల్సిన వారిని టార్గెట్ చేసుకుని, ఏజెంట్లతో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో పుట్టకపోయినా.. అక్కడే జన్మించినట్లు నకిలీ సర్టిఫికెట్లును సృష్టించారు. పాస్ పోర్టులు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎక్కువగా ఈ ఫేక్ బర్త్ సరిఫికెట్లును ఆశ్రయిస్తున్నారు. 1991 నుంచి 2010 వరకు ఈ ముఠా 2వేల 022 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తయారు చేశారు. హెల్త్ అసిస్టెంట్స్ అడపరెడ్డి రాజు, రామకృష్ణ , చిటికెల బాబు, రెడ్డి నానిబాబులను  అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రాకెట్ లో మరో 10 మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు సీపీ మహేష్ భగవత్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy