GHMC అలర్ట్ : ఉద్యోగులు ఒకేసారి బయలుదేరొద్దు

ghmcహైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. రోడ్లకు అడ్డంగా కొమ్మలు ఉన్నాయి. సిటీ వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో 13 ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయని తెలిపింది జీహెచ్ఎంసీ. రోడ్లపై ఎవరికి వారు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దని సూచించింది. సిబ్బంది అంతా ప్రత్యేక టీమ్స్ గా రంగంలోకి దిగారని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలతో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి రోడ్లపై నీళ్లను క్లియర్ చేస్తామని తెలిపింది. అంతే కాకుండా.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం అని.. అందరూ ఒకేసారి ఆఫీసుల నుంచి బయలుదేర వద్దని సూచించింది. గంట నుంచి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిందని ఇదంతా క్లియర్ కావటానికి గంట సమయం పడుతుంది అంటున్నారు అధికారులు.

ఆఫీసుల నుంచి ఉద్యోగులు కొంచెం ఆలస్యంగా బయలుదేరితే ట్రాఫిక్ ఇక్కట్లు ఉండవని తెలిపింది. రెగ్యులర్ టైం కంటే కొంచెం సమయం తీసుకోవాలని కోరింది. ఇప్పటికే GHMC సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ రోడ్లపైనే తిరుగుతూ నీళ్లు, రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లకు క్లియర్ చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలిపింది.

నాచారం, మల్లాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, సైనిక్ పురి, కుషాయిగూడ, దమ్మాయిగూడ, కోఠి, బర్కత్ పుర, నారాయణగూడ, ఉప్పల్, రామాంతాపూర్, చార్మినార్, దిల్ ఖుష్ నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లు జలమయం అయ్యాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy