GHMC ఓట్ల తొలగింపునకు ఫుల్ స్టాప్

High courtగ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల తొలగింపు వివాదానికి హై కోర్టు పుల్ స్టాప్ పెట్టింది. 6 లక్షల 30 వేల ఓట్ల తొలగింపులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నివేదికను సమర్ధించింది. మరో లక్ష 60 వేల ఓట్లు అదనంగా తొలగిస్తున్నారని పిటిషనర్ వాదనలకు ఏకీభవించని ఉన్నత న్యాయస్థానం..ఇంకా ఎలాంటి విచారణ అవసరం లేదని కేసును మూసివేసింది.

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు గ్రేటర్ ఓటర్ల తొలగింపు పెద్ద దుమారే రేగింది. 6 లక్షల 30 వేల ఓట్లు తొలగించారని అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్ పై ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశాయి. సీ.ఈ.సీ. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు పిర్యాదులు స్వీకరించి నివేదికను సమర్పించింది. అయితే ఇదే ఇష్యూలో సోమేష్ పై వేటు పడి బదిలీ అయ్యారని మున్సిపల్ అధికారుల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అరోపించారు. పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పిర్యాదు చేశారు. కాంగ్రేస్ నేత నగేష్ ముదిరాజ్, అడ్వకేట్ జంద్యాల రవిశంకర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లను అక్రమంగా తొలగించారని ఎన్నికల పక్రియను అపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పక్రియ పై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అదేశించింది ఉమ్మడి హై కోర్టు.

ఓట్ల తొలగింపులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని సీఈసీ నివేదిక తెలిపింది. 6.30 లక్షల్లో చనిపోయిన వారు ఉన్నారు. ఇంటికి లాక్ వేసి ఉన్నవారు. ఆ ఆడ్రస్ లో లేని వారి పేర్లను తొలగించామని తెలిపారు. దీనికి పై ఎలాంటి అభ్యంతరాలు సేకరించి పిర్యాదు చేసుకున్న వారికి మళ్లీ ఓటు హక్కు కల్పించారని తెలిపారు. అయితే మరో లక్ష 60 వేల ఓట్లను తొలగించేందకు జీ.హెచ్.ఎం.సీ. సిద్దంగా ఉందని సిబ్బంది మీటింగ్ లో వారి మినట్ సంపాదించామని అడ్వకేట్ జంద్యాల రవిశంకర్ తెలిపారు. అయితే ఎలాంటి అదారాలు లేకపోవడం.. రెండు ఓట్లు ఉన్న వారి లెక్కలు తీసిన సమయంలో లక్ష 50 వేల మంది ఉన్నట్లు గుర్తించామని జీ,హెచ్.ఎం.సీ తరుపు న్యాయవాధి వాదనలు వినిపించారు. ఇరు వాదనలను.. సీ.ఈ.సీ. నివేదికను క్షుణంగా పరిశీలించిన జస్టిస్ నాగార్జున రెడ్డి. ఎన్నికలు అయిపోయేంత వరకు ఎలాంటి ఓటర్లు ఇక తొలగించరాదని జీ.హెచ్.ఎం.సికి అదేశాలు జారీచేశారు. తదుపరి విచారణలో ఎలాంటి వాదనలు వినాల్సిన అవసరం లేదంటూ పిటిషన్ ను డిస్పోజ్ చేశారు.

ఓటర్ల తొలగింపు పక్రియ పై స్పష్టతమైన తీర్పు ఇచ్చిన హై కోర్టు. రిజర్వేషన్స్ జాబితా విడుదల అయితే ఉన్నత న్యాయస్థానానికి మరికొన్ని పిటిషన్స్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కుల వర్గీకరణ పై సమగ్ర సర్వే లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి మొదటి వారంలోపు నోటీఫికేషన్ విడుదల చేసి హై కోర్టు దర్మాసనం అదేశాల మేరకు జనవరి 31 వరకు ఎన్నిక ప్రకియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy