GHMC మరో సంచలనం : ఫ్రీ టిఫిన్ సెంటర్స్

Swacch-Food-Bank-Hyderabad-1024x576ఇప్పటికే నగరంలో ఐదు రూపాయల భోజనంతో పేదల ఆకలితీరుస్తున్న GHMC..  ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సగం కడుపుతో అలమటించే ఎంతోమంది పేదలు.. చిన్న తరహా కార్మికుల  కోసం ఉచితంగా అల్పాహారం  కూడా  అందించాలనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది GHMC.  ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే కంపెనీల సహకారంతో రాజేంద్రనగర్‌లో మొదటి స్వచ్ఛ ఫుడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. కాటేదాన్‌లో చాక్లెట్‌, బిస్కెట్‌, బ్రెడ్‌ తయారీ కంపెనీలు ఉన్నాయి.

ఉత్పత్తి క్రమంలో విరిగిపోయిన, సరైన ఆకృతి లేని పదార్థాలను తక్కువ ధరకు విక్రయించడం లేదా వృథాగా పారేస్తున్నారు. వీటిని సేకరించి స్వచ్ఛ ఫుడ్‌ బ్యాంక్‌ ద్వారా నిరుపేదలకు ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ఫలితంగా పేదలకు ఉచితంగా అల్పాహారం అందుబాటులోకి తెచ్చినట్లు ఉందన్నారు అధికారులు. ఈ బిస్కెట్లు, బ్రెడ్‌ను ప్రస్తుతం ఉదయం పారిశుధ్య విధులు నిర్వహించే కార్మికులకూ అందిస్తున్నారు. ఇతర ప్రాంతాలకూ స్వచ్ఛ ఫుడ్‌ బ్యాంకులను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఆహార పదార్థాల ఉత్పత్తి పరిశ్రమలు ఉన్న చోట, సమీప ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. ఈ గొప్ప కార్యక్రమాలతో  ఉదయం ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్నం రూ.5కే భోజనం అందించి నిరుపేదల కడుపు నింపుతోన్న ఘనత GHMC కి దక్కుతుంది. బ్యాంకుల్లో అందుబాటులో ఉంచే ఆహార పదార్థాలను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు పరిశీలించిన తర్వాతే అందజేస్తామని  తెలిపారు అదనపు కమిషనర్‌ రవికిరణ్‌. ఈ ఫ్రీ టిఫిన్ సెంటర్స్ నగరంలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు అనే విషయాలు త్వరలోనే వెల్లడించనుంది GHMC.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy