GHMC లో గెలుపు మాదే: తలసాని

TRSLPజీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత మంత్రి తలసాని మాట్లాడారు.

  • 18 నెలల ప్రభుత్వ పని తీరును ప్రజల్లోకి తీస్కెళ్తాం
  • గ్రేటర్ లో 100 సీట్ల లో గెలుస్తాం..150  డివిజన్లలో పోటీ చేస్తాం
  • ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
  • హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి చర్యలు చేపట్టాం
  • మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, స్కైవేలకు శంకు స్థాపన చేశాం
  • హైదరాబాద్ ను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం
  • హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం
  • హైదరాబాద్ లో తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృష్ణా త్రీ ఫేజ్, గోదావరి జలాలను ఇప్పటికే తరలించాం
  • విపక్షాలు ఇష్టం వచ్చినట్లు  మాట్లాడుతున్నాయి
  •  ప్రభుత్వ పథకాలను పెద్ద  ఎత్తున చేపట్టాం
  • కోతల్లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం
  • దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్ల సంఖ్యను పెంచుతాం
  • మున్సిపల్ కార్మికులకు ఊహించని విధంగా జీతాలు పెంచాం

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy