GPSకి కూడా దొరకని శ్రీకాంత్ ఆచూకీ

Kidnap

ఢిల్లీలో కిడ్నాపైన డాక్టర్ శ్రీకాంత్  ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నా.. ఇప్పటికీ చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. కిడ్నాపర్ ఫ్రెండ్.. ఓలా ఏజెంట్ సంజయ్ అన్సారీ, కిడ్నాపర్ ను ఓలాలో చేర్చేందుకు రెఫరెన్స్ ఇచ్చిన సంజయ్ త్రిపాఠిలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే.. తన తప్పేంలేదని.. కేవలం రెఫరెన్స్ ఇచ్చినందుకు కేసులో ఇరుక్కున్నానని చెబుతున్నాడు సంజయ్ త్రిపాఠి. ఓలా క్యాబ్ సర్వీసెస్ ల చేరేందుకు కిడ్నాపర్ నాలుగుసార్లు అప్లై చేసుకున్నా.. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది.  దీంతో సంజయ్ త్రిపాఠి అనే డ్రైవర్ ఐడీతో ఓలాల చేరాడు. తనవేనని చెప్పిన గుర్తింపు పత్రాలన్నీ నకిలీవని పోలీసుల విచారణలో తేలింది.

అయితే.. ఇందులో ఓలా సంస్థ తప్పు కూడా ఉందంటున్నారు డ్రైవర్ సంజయ్ త్రిపాఠి. డ్రైవర్లు ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ సరైనవేనా.? కాదా..? అనేది చెక్ చేయకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.  శ్రీకాంత్ అడ్రస్ కోసం పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ సిగ్నల్, GPS ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామని ఢిల్లీ ప్రీత్ విహార్ ఏసీపీ రాహుల్ చెప్పారు. కిడ్నాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవరు వాహనంలో ఉన్న GPS ను ఆఫ్‌ చేసి కారు నంబర్‌ ప్లేట్‌ మార్చి తిరుగుతున్నట్టు గుర్తించారు. కారు కదలికలపై పూర్తి నిఘా ఉం చామని చెబుతున్నారు. రెండువేల మందికి పైగా పోలీసులు ఢిల్లీ, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ మీరట్ ప్రాంతాల్లో వెతుకుతున్నారని చెప్పారు. నిందితుడు 150 కిలోమీటర్ల లోపలే ఉన్నడని.. ఏ మాత్రం క్లూ దొరికినా పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.  దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సోమవారం(10-జూలై-2017) ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి శ్రీకాంత్‌గౌడ్‌ కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నా రు. వీలైనంత త్వరగా కిడ్నాపర్‌ చెర నుంచి శ్రీకాంత్‌ను విడిపించాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy