GSAT-6A కౌంట్ డౌన్ : కమ్యూనికేషన్స్ శాటిలైట్స్ లో బాహుబలి

gsatమరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సిద్ధమైంది. గురువారం (మార్చి29) శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 4.56 గంటలకు GSLV-F08 రాకెట్‌ ద్వారా జీశాట్‌-6A ఉపగ్రహం నింగిలోకి ఎగరనుంది. జీశాట్-6ఏ బరువు 2,140 కిలోలు. ఈ రోజు(మార్చి28) మధ్యాహ్నాం 1:56 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఈ జీశాట్‌-6ఏ మరింత బలం చేకూర్చుతుంది.

ఈ రోజు(మార్చి28) ఉదయం బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఇస్రో ఛైర్మన్ కె శివన్. మార్చి 29వ తేదీ ప్రయోగించే GSLV-F08 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుతూ శ్రీవారికి మొక్కులు చెల్లించారు. ఈ రాకెట్ తో జీశాట్ 6ఏ ఉపగ్రహ ప్రయోగం చేయనున్నట్లు చెప్పారు. దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రయోగం చేస్తున్నామన్నారు శివన్. శాటిలైట్ బేస్డ్.. మొబైల్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ శాటిలైట్. 2 టన్నుల బరువు ఉండే ఈ ఉపగ్రహం 10 ఏళ్లు సేవలు అందించనుంది. దీని కోసం ఇస్రో రూ.270 కోట్లు ఖర్చు చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy