GSTతో నష్టం లేదు..లాభమే: కేసీఆర్

kcr కేంద్ర ప్రభుత్వం చేపట్టిన GSTపై ప్రజలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో వాణిజ్య పన్నుల విభాగంలోని 91 సర్కిళ్లలో సదస్సులు నిర్వహించాలన్నారు. GST అమలు, దాని ప్రభావాలపై సీఎం కేసీఆర్ సోమవారం (జులై 3) వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. GST అసలు స్వరూప, స్వభావాలను ప్రజలకు, వ్యాపారులకు పూర్తిగా చెప్పి.. వారిలో భయాందోళనలు పోగొట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రూ. 20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు ఉందని.. ఇది తెలంగాణలోని లక్షల మంది చిన్న వ్యాపారులకు ఉపయోగకరమైన నిర్ణయమన్నారు సీఎం. రాష్ట్రంలోని వాణిజ్య పన్ను శాఖ అధికారులు ఈ విషయాన్ని వ్యాపారులకు కూలంకషంగా వివరించి చెప్పాలని ఆయన సూచించారు. చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని ఏవిధంగా నిర్వహించుకోవాలో అధికారులు సూచించాలన్నారు.

మొత్తంగా GST తో రాష్ట్రానికి కొద్దో గొప్పో ప్రయోజనమే తప్ప.. నష్టం జరిగే అవకాశం లేదన్నారు. చిన్న వ్యాపారులు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పన్ను ఎగవేతదారులను గుర్తించి, వారి నుంచి పన్ను వసూలు చేయడానికి మాత్రం GST కచ్చితంగా ఉపయోడపడుతుందన్నారు కేసీఆర్. దీని ద్వారా ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలా వచ్చిన ఆదాయం చివరికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజలకే అందుతాయన్నారు.

మరోవైపు GST నుంచి పెట్రోలియం, ఎక్సైజ్ అంశాలను మినహాయించడం వల్ల రాష్ట్రానికి వచ్చే 50 శాతం ఆదాయంపై ప్రభావం ఉండదన్నారు అధికారులు. మిగతా 50 శాతంలో రాష్ట్రానికి తిరిగి కనీసం 50 శాతం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కేంద్రానికి పెరిగిన ఆదాయంలో రాష్ట్రానికి ఎలాగో వాటా పంచాలి కాబట్టి రాష్ట్రానికి కూడా కచ్చితంగా కేటాయింపు పెరిగి తీరుతుందని సీఎం వివరించారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy