GSTలో అన్ని వస్తువులను కలుపడం సాధ్యం కాదు : మోడీ

MODIఒకేదేశం ఒకే పన్ను అనే నినాదంతో ప్రారంభమైన వస్తు సేవల పన్ను (GST) అమల్లోకి వచ్చి ఏడాది ఆదివారం (జూలై-1)కి ఏడాది పూర్తయ్యింది. దీనిపై విమర్శలు ..ప్రశంసలు వచ్చినప్పటికీ , కేంద్రం మాత్రం తనపని చేసుకుంటూ పోతోంది. జూలై 1ని GSTడేగా ప్రకటించిన కేంద్రం ఆదివారం మొదటి వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించింది.  ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ..GST కింద అన్ని వస్తువులను కలుపడం సాధ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నట్లు అన్ని రకాల వస్తువులకూ ఒకే విధంగా 18 శాతం పన్ను విధిస్తే ఆహారం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు మోడీ.

పాలకు, మెర్సిడెస్‌ కారుకు ఒకే విధమైన పన్ను వేయగలమా  అని చెప్పుకొచ్చారు ప్రధాని. GST ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ మేగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.  ఏడాదిలో రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను రద్దు చేయగలిగామని, దీంతో ఆయా చోట్ల క్యూలను నివారించడం ద్వారా ట్రక్కు డ్రైవర్ల సమయాన్ని వృథా కాకుండా ఆపడంతోపాటు దేశంలో ఉత్పాదకతను మరింత పెంచేందుకు దోహదపడ్డామని అన్నారు. అంతేకాకుండా 17 ట్యాక్స్‌ లు, 23 సెస్‌ లను ఒకే పన్ను కిందికి తీసుకురాగలిగామన్నారు. ఇన్‌ స్పెక్టర్‌ రాజ్‌ ను తొలగించడం ద్వారా కేంద్రస్థాయిలోని ఎక్సైజ్‌ డ్యూటీ, సర్వీస్‌ ట్యాక్స్‌ను, రాష్ట్రాల స్థాయిలో వ్యాట్‌ను కలిపి వేయగలిగామని తెలిపారు.  అయితే ఎప్పటికప్పుడు ఈ పన్ను విధానంలో మార్పులు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వాలు, సంఘాలు, ఇతర భాగస్వాముల సూచనలను పాటిస్తున్నామని తెలిపారు ప్రధాని మోడీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy