GST ఎఫెక్ట్: పెర్టిలైజర్స్ కు రెక్కలు

gst-farmersఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. జూలై1 నుంచి GST అమల్లోకి వస్తుండటంతో పాత ధరలకే ఎరువులు అమ్మాలంటే తమతో కాదని ఇప్పటికే కేంద్రానికి తెలియజేశాయి ఎరువుల కంపెనీలు. దీంతో ఎరువుల పై 5 శాతం, పురుగుల మందులపై ఉన్న 12శాతం పన్నును భారీగా పెంచింది. ఎరువుల పై 12 శాతం, పురుగుల మందులపై 18 శాతం  పన్ను ఖరారు చేసింది GST కమిటీ. దీంతో బస్తా యూరియా ధర 30 నుంచి 36 రూపాయిల వరకు పెరగనుంది. కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.600 నుండి 800 వరకు పెరగనున్నాయి.

జులై1వ తేదీ నుంచి కొత్తగా అమలయ్యే GST తో పన్ను రూపంలో వచ్చే ఆదాయంలో 58 శాతం కేంద్రానికి, 42 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. అయితే ఇప్పటి వరకు ఎరువులపై ఉన్న రాయితీలన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. GST అమల్లోకి వస్తే ఈ విధానం ఉండదు. కొత్తగా అమలయ్యే జిఎస్టీతో పెరిగే ధరలను కేంద్రం లేదా రాష్ట్ర సర్కార్ లు భరిస్తే తప్ప.. రైతులకు ఆర్థిక భారం తప్పదంటున్నారు నిపుణులు.

పురుగు మందులు, ఎరువులపై పన్ను పెంచితే.. రైతుకు ఎకరానికి 3 నుంచి 4 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు అవుతుందంటున్నారు రైతు సంఘం నేతలు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం…ఇష్టానుసారంగా పన్నలు విధిస్తే  తమపై ఇంకింత భారం పడుతుందంటున్నారు అన్నదాతలు. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగితే.. రాష్ట్రంలోని రైతుల పై 300 కోట్ల వరకు భారం పడుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy