GST డే : కేంద్రం భారీ ఏర్పాట్లు

GST 1కేంద్రం దృష్టిలో ఆర్థిక సంస్కరణ.. అపోజిషన్ దృష్టిలో గబ్బర్ సింగ్ టాక్స్.. కొందరి మద్దతు.. మరికొందరి వ్యతిరేకత… మొత్తంగా గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఏడాది పూర్తి చేసుకుంది. అంతా సెట్ రైట్ అయ్యింది.. కొంతే సమస్య ఉందని అధికారులు అంటుంటే… అపోజిషన్ మాత్రం అదో చెడ్డ నిర్ణయమంటూ ఫైర్ అవుతోంది. ఇక.. వార్షికోత్సవ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అయ్యింది కేంద్రం. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చి ఏడాది పూర్తైంది. గత ఏడాది ఇదే రోజున అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాలులో జీఎస్టీ అమలును అధికారికంగా ప్రారంభించారు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈ సందర్భంగా జులై 1ని జీఎస్టీ డేగా ప్రకటించింది కేంద్రం.

జీఎస్టీ అమలులో సమస్యలు చాలావరకు అధిగమించామన్నారు ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా. టెక్నాలజీ సమస్య కొంతవరకు ఉందని.. దానిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రిటైర్న్స్ ఫైలింగ్ లో ఉన్న సమస్యలను తొలగిస్తున్నామని చెప్పారు.  పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా.. ఒక విధానంలో అయితే ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. మరో విధానంలో కేంద్రం ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు.

వెస్ట్ బెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా మాత్రం.. జీఎస్టీని ఓ చెడ్డ నిర్ణయంగా తేల్చేశారు. అమలు తీరు సరిగా లేకపోవడంతో చిన్నమధ్యతరహా పరిశ్రమలు నడిపే వారు ఏడుస్తున్నారన్నారు. మొదట పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని.. చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. సాంకేతిక సమస్యలతో మళ్లీ కాగితాలతోనే రిటర్న్ లు ఫైల్ చేయాల్సి వస్తోందన్నారు. జీఎస్టీ సేవలు అందిస్తున్న కొన్న సంస్థలు మాత్రం… వ్యవస్థ ప్రస్తుతం సెట్ రైట్ అయ్యిందంటున్నారు. ప్రారంభంలో కొన్ని సమస్యలున్నా ప్రభుత్వం జోక్యంతో అవి తొలగిపోయాయని చెబుతున్నారు. జీఎస్టీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం (జూలై-1) ఆర్థికశాఖ ఇంచార్జి మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy