GST పరిధిలోకి రియల్ ఎస్టేట్‌: జైట్లీ

jaitelyreరియల్ ఎస్టేట్‌ రంగాన్ని కూడా GST కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.  అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. హార్వర్డ్ యూనివర్శిటీలో మాట్లాడారు. ఇండియా చేపట్టిన పన్ను సంస్కరణలపై  అభిప్రాయాలను వినిపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరుగుతున్నదని.. త్వరలోనే ఆ రంగాన్ని కూడా GST కిందకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. GST మండలి నిర్వహించే తర్వాత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. గౌహతిలో నవంబర్ 9వ తేదీన తర్వాత GST సమావేశాలు జరగనున్నాయి.

నగదు మార్పిడి ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నదని… అక్కడే ఎక్కువ శాతం పన్ను కూడా ఎగవేస్తున్నారని, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు జైట్లీ. రియల్‌ రంగాన్ని GST కిందకు తీసుకురావాలని తాను కూడా గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.  వచ్చే నెలలో జరిగే GST  సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, అందుకే దానిపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ నిర్మాణాలపై 12 శాతం జీఎస్టీ వసూల్ చేస్తున్నారు. అయితే భూమి, స్థిరాస్తులపై మాత్రం GST లేదు. నోట్లు రద్దు అనేది ప్రాథమిక సంస్కరణ అని…దేశాన్ని పన్ను ఎగవేత నుంచి ఆదుకునేందుకు తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు జైట్లీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy