GST బిల్లుకు కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం

Srinagar: Jammu and Kashmir legislatures observe 2 minute silence to pay homage to former members of the house and former governor G C Saxena who died between the between the two sessions of the state Assembly in Srinagar on Saturday. PTI Photo by S irfan(PTI6_17_2017_000107B)

ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే జమ్ము కాశ్మీర్‌ శాసనసభ GST బిల్లును ఆమోదించింది. దీంతో వస్తు సేవల పన్ను అమలు చేయనున్న చివరి రాష్ట్రం జమ్ము కానుంది. జమ్ముకాశ్మీర్‌ వస్తు సేవల పన్ను బిల్లు 2017  పేరుతో ఉన్న బిల్లును రాష్ట్ర ఆర్థిక మంత్రి హసీబ్‌ ద్రబు శాసనసభలో ప్రవేశపెట్టారు. GST అమలు చేయాలన్న రాష్ట్రపతి ఉత్వర్వును పాటిస్తూ జమ్ము కాశ్మీర్‌ ప్రత్యేక హోదాను ప్రభుత్వం తాకట్టు పెట్టిందంటూ ప్రతిపక్షాలు సభను బహిష్కరించాయి. ఆ తర్వాత బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. నేటి ( 07-07-17) రాత్రి నుంచే జమ్ముకాశ్మీర్ లో  GST అమల్లోకి రానుంది. GSTతో జమ్ము కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి భంగం కలగదని  ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy