GST రేట్లు తెలుసుకోండిలా.. యాప్ వచ్చేసింది

APP-GSTజీఎస్టీ రేట్లపై గందరగోళం నెలకొందా… అస్సలు టెన్షన్ పడనక్కర్లేదు. జీఎస్టీ రేట్లపై అవగాహన కోసం కొత్తగా యాప్ తీసుకొచ్చింది కేంద్రం. ‘జీఎస్టీ రేట్స్‌ ఫైండర్‌’ పేరుతో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఈసీ) ఈ మొబైల్‌ యాప్‌ను తీసుకు వచ్చింది. దీని ద్వారా ఏయే వస్తువులపై ఏ పరిధిలో ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా గూడ్స్, సర్వీసు టాక్స్ వివిధ పన్ను రేట్లను తెలుసుకోవచ్చు. అన్నిఆండ్రాయిడ్‌ ఫోన్ల ద్వారా ఈ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐవోఎస్‌ లో త్వరలో విడుదల  చేయనుంది. అంతేకాదు డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత  ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనూ ఈ యాప్‌ పనిచేయడం దీని ప్రత్యేకత. దీంతో పాటు వివిధ రేట్లు తెలుసుకునేందుకు వినియోగదారులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వెబ్‌సైట్‌ http://cbec-gst.gov.in కు కూడా లాగిన్ అవ్వవచ్చు. కొత్త పరోక్ష పన్ను పాలసీ   ప్రకారం పన్ను చెల్లింపుదారుడు వర్తించే సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ పన్ను రేటు,  పరిహారం సెసేస్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చునని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్  తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy