GST రేట్ కార్డ్ : పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ లో మార్పులు ఇలా

post-pre-paidజూలై ఒకటో తేదీ నుంచి గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) అమల్లోకి వస్తుంది. మీ జీవితంలో భాగమైన సెల్ ఫోన్ బిల్లుల మోత మోగనుంది. ఇవాల్టి వరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరోలెక్క. ప్రస్తుతం 15గా ఉన్న పన్ను.. 18శాతం స్లాబ్ లోకి మారింది. జూలై ఒకటో తేదీ నుంచి పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్లమర్ల రీఛార్జ్, బిల్లుల్లో ఎలాంటి మార్పు ఉంటుందో వివరంగా తెలుసుకుందాం..

పోస్ట్ పెయిడ్ యూజర్స్ :

… ప్రస్తుతం నెలావారీ బిల్లు రూ.500 అవుతుంది. ట్యాక్స్, సెస్ అన్నీ కలుపుకుని రూ.575  చెల్లిస్తున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి GST  పరిధిలోకి వస్తారు. మీరు బిల్లు రూ.500గానే ఉంటుంది. 3శాతం అదనంగా ట్యాక్స్ ఉండటంతో బిల్లు రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.15 అదనం.

ప్రీపెయిడ్ యూజర్స్ కోసం :

… ప్రస్తుతం మీరు 100 రూపాయల ఓచర్ తో రీఛార్జ్ చేసుకుంటున్నారు. మీకు రూ.85 టాక్ టైం వస్తుంది. ఇప్పుడు GST అమల్లోకి వచ్చిన తర్వాత అదే వంద రూపాయల ఓచర్ కు.. టాక్ టైం 82 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే మూడు రూపాయలు అదనంగా కట్ అవుతుంది. మీరు పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఏదైనా కావొచ్చు.. మీ బిల్లు పెరిగే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. ఓ మధ్యతరగతి వ్యక్తి బడ్జెట్ అంచనా ప్రకారం తీసుకున్న లెక్కలు ఇవి.

ఇప్పటికే రిలయన్స్ జియోతో భారీగా నష్టపోయాం అని చెబుతున్న టెలికాం కంపెనీలకు ఇది కొంచెం ఊరట అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉన్న 15శాతాన్ని.. 12పర్సంట్ స్లాబ్ లోకి తీసుకురావాలని టెలికాం కంపెనీల వినతిని కేంద్రం పట్టించుకోలేదు. 18శాతం స్లాబ్ లోకి మార్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy