HCA అధ్యక్షుడిగా వివేక్

vivek-sirహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో జి. వివేకానంద్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. పోలైన మొత్తం 206 ఓట్లలో వివేకానంద్ కు 136 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది రౌండ్ లలో రౌండ్ రౌండ్ కు ముందంజలో సాగిన వివేకానంద్ ప్యానల్… గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ… హైదరాబాద్ క్రికెట్ కు మంచి రోజులు తీసుకొస్తామని చెప్పారు. నైపుణ్యం కలిగిన క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. అవినీతి, అవకతవకలపై దృష్టిసారించి… వెలికితీస్తామన్నారు. పారదర్శకతతో పనిచేస్తామన్నారు వివేక్. ప్యానెల్ విజయంతో సంబురాల్లో మునిగింది వివేకానంద్ టీమ్.

HCA తుది ఫలితాలు:

ప్రెసిడెంట్ – జి. వివేకానంద్ – 136

వైస్ ప్రెసిడెంట్ – అనిల్ కుమార్  – 138

సెక్రటరీ  – శేష్ నారాయణ  – ఏకగ్రీవం

జాయింట్ సెక్రటరీ – అజ్మల్ అసద్  – 124

ట్రెజర్ – మహేందర్ – 148

ఎగ్జిటీవ్ మెంబర్ – హన్మంత్ రెడ్డి  -100

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy