HCA ఎన్నికల్లో వివేక్ ప్యానెల్ దే గెలుపు: జీ.వినోద్

Vinod-hcaHCA ఎన్నికలపై  హైకోర్టు తీర్పును స్వాగతించారు మాజీ మంత్రి వినోద్. వివేక్ ప్యానెల్ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. ఇన్నాళ్లు HCAలో జరిగిన అవినీతిపై కొత్త కమిటీ వేసి.. విచారణ చేయించాలని సూచించారు వినోద్.

ఇక జనవరి 17న హైదరాబాద్  క్రికెట్ అసోసియేషన్ కు  ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి  ప్రభుత్వ సలహాదారు  జి.వివేకానంద్ తో పాటు.. మాజీ  క్రికెటర్ జయసింహ  పోటీ పడ్డారు. వైస్ ప్రెసిడెంట్,  ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ,  ఈసీ మెంబర్  పదవులకు  మరో 16 మంది  పోటీ పడ్డారు. మొత్తం  218 ఓట్లకు  206 ఓట్లు  పోల్ అయ్యాయి. 6 పదవులకు  18 మంది పోటీ  పడ్డారు. హైకోర్టు  ఆదేశాలతో.. ఎన్నికల ఫలితాలను అధికారులు  ప్రకటించలేదు. ఇప్పుడు.. ఫలితాలు ఇవ్వాలని  హై కోర్టు  ఆదేశించడంతో.. ఫలితాల విడుదలకు  రూట్ క్లియర్ అయ్యింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy