HCA కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

hca-hgh-courtహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలకు రూట్ క్లియర్ అయ్యింది. HCA అధ్యక్ష ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది. వెంటనే కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది న్యాయస్థానం. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సలహాదారు వివేక్ తో పాటు.. మాజీ క్రికెటర్ జయసింహ పోటీ పడ్డారు. సెక్రటరీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. హైకోర్టు ఆదేశాలతో సాయంత్రం లేదా రేపు కౌంటింగ్ పూర్తిచేసి.. ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 17, 2017న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.

ఇది తెలంగాణ విజయం : శేషునారాయణ

ఇది తెలంగాణ విజయంగా అభివర్ణించారు శేషునారాయణ. ఎంతో కష్టపడ్డామని.. కొందరి వ్యక్తుల వల్లే ఇలా జరిగిందన్నారు. ఇప్పటికైనా న్యాయం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి.. ఫలితాలు ప్రకటించాలన్నారు.

HCAలో సమస్యలు తీరినట్లే : వినోద్, మాజీ మంత్రి

HCA ఎన్నికలపై దాఖలైన పిటీషన్లను కొట్టివేసి.. ఫలితాలు ప్రకటించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు మాజీ మంత్రి వినోద్.అవకతవకలు అన్నీ క్లియర్ అవుతాయని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మంచి రోజులు వచ్చాయన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy