
ఏ మందుతోనైనా ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది. వేసవికాలంలో పచ్చకర్పూరం తీసుకుంటే వడదెబ్బ, అతిదాహం, తపన, శరీరం చిటపటలాడటం, శోష వంటివి తగ్గిపోతాయి. బీపీ వున్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బీపీ పెరగకుండా అరికడుతుంది. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, ఎరుపెక్కడం, నీరుకారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటిని మెత్తగా నూరి, దాంట్లో ఎండుద్రాక్షవేసి మాత్రలాగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని, పాలు తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది.