హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభం

hyd1దేశవిదేశాలకు చెందిన సాహితీ వేత్తలు, ప్రఖ్యాత రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థులు హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్- 2014లో సందడి చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఆషియానాలో శుక్రవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఆషియానాతోపాటు, కల్ప స్కూల్, సప్తపర్ణి, లామకాన్, కళాకృతి ఆర్ట్ గ్యాలరీ వేదికలపై మూడురోజులపాటు ఈ సాహితీ వేడుకలు జరుగనున్నాయి. ఫెస్ట్ ప్రారంభ కార్యక్రమంలో ఐరిష్ అంబాసిడర్ ఫెలిమ్ మెక్‌లాలిన్, ప్రముఖ దర్శకుడు మహేష్ దత్తాని, రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధానకార్యదర్శి చందనా ఖన్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ జయేష్ రంజన్, నగర కమిషనర్ అనురాగ్ శర్మ, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అమిత్‌గార్గ్‌లతోపాటు దేశవిదేశాలకు చెంది న సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ వేదికలను అనుసంధానించే మార్గానికి నిర్వాహకులు లిటరరీ స్ట్రీట్‌గా పేరు పెట్టారు. ఈ లిటరరీ స్ట్రీట్‌లో శుక్రవారం దేశవిదేశాలకు చెందిన సాహితీ వేత్తలు, ఐరిష్ అంబాసిడర్ మెక్‌లాగ్లిన్ శుక్రవారం వాక్ నిర్వహించారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా ఫెస్టివల్‌కు ప్రధాన వేదికైన ఆషియానాలో వంద సంవత్సరాల తెలుగు దళితుల రచనలు, ఐర్లాండ్ సాహిత్యం, అంశాలపై చర్చలు, ప్రసంగాలు, ప్యాలెన్ చర్చలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వేమన యూనివర్శిటీ ప్రొఫెస ర్ వినోదిని, గోగు శ్యామల, జిలుకర్ర శ్రీనివాస్ లు దళిత సాహిత్యం గురించి మాట్లాడారు. పాటల రచయిత గోరటి వెంకన్న దళితుల బాధలపై పాటలు పాడి వినిపించారు. అలాగే మరో వైదికైన కల్పా స్కూల్‌లో చిన్నారులను ఆకట్టుకునే పలు కార్యక్రమాలు, వారిని అలరించే టాయ్స్‌ను తయారు చేసుకునే సులభమైన విధానంపై శిక్షణనిచ్చారు.

కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనంలో తమదైన గుర్తింపును సాధించుకున్న జగదీష్ మిట్టల్, ఆర్తీ వీర్, ప్రియాంక ఏలేల కుంచెల నుంచి జాలువారిన అపుపూరమైన చిత్రలేఖనాల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న లమాకాన్ వేదికలో తొలి రోజు కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులకు కథల చెప్పటంపై వర్క్‌షాప్ నిర్వహించారు. వీటికి తోడు సప్తపర్ణి వేదికలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలకు చెందిన పలు పుస్తకాలతో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy