ICC ఉమెన్స్ చాంపియన్ షిప్ : భారత్ టార్గెట్-333

alyssa-healyఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌ లో భారత్ కు భారీ టార్గెట్ ను ముందుంచింది ఆస్ట్రేలియా. వడోదర వేదికగా ఆదివారం (మార్చి-18)న జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది.

నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్ అలిస్సీ హీలీ సెంచరీతో చెలరేగింది. అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో హీలీకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఆరంభం నుంచి ఆతిథ్య భారత మహిళల బౌలర్లపై విజృంభించి పరుగుల వరద పారించింది. ముచ్చటైన షాట్లతో బౌండరీల వర్షం కురపించింది. మొత్తం 115 బంతులు ఎదుర్కొన్న అలిస్సీ 17ఫోర్లు, 2సిక్సర్లతో 133 పరుగులు చేసింది. ఓవైపు మధ్యమధ్యలో వికెట్లు కోల్పోతున్నప్పటికీ ఏమాత్రం బెదరకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ఆసీస్‌కు భారీ స్కోరు అందించింది. భారత బౌలింగ్ లో కౌర్ (2), శిఖా, దీప్తీశర్మ, బిష్, పూనమ్ లకు తలో వికెట్ దక్కాయి. ఇప్పటికే 0–2తో సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. ఈ వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy