ICC ఉమెన్స్ వరల్డ్ కప్: పాక్ టార్గెట్ 170

sportsభారత్-పాక్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆదిలోనే తడబడ్డ భారత్. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి పాకిస్ధాన్ కు 170 పరుగుల టార్గెట్ ఇచ్చింది భారత్. ఇది వరకు టోర్నమెంట్లో మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మందన రెండు పరుగులు చేసి మూడవ ఓవర్లోనే వెనుతిరిగింది. పూనమ్ రౌత్ (47) , దీప్తీ శర్మ (28) పరుగులతో నిలకడగా ఆడారు. కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం 8 పరుగులు చేయగా.. హర్మన్ ప్రీత్ (10) , మోనా మిశ్రా (6) పరుగులతో పెవీలియన్ దారి పట్టారు. సుశ్మా 33 పరుగులు, గోస్వామి 14 పరుగులు చేశారు. మాన్సీ 4 పరుగులు.. పూనమ్ యాదవ్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. పాకిస్ధాన్ బౌలర్లలో నశ్రా సాంధు 4 వికెట్లు తీసి భారత బాటింగ్ ను కుప్ప కూల్చింది. సాధియా యూసఫ్ 2 వికెట్లు.. అస్మావియా, డియానా చెరో వికెట్ తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy