IPL ఆపండి : బెట్టింగ్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్

iplapril6ఈ సీజన్ IPL జరగకుండా ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పిటిషన్ దాఖలు చేశారు. IPL లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈ సారి IPLను జరపకూడదని సంపత్‌కుమార్ అనే అధికారి కోరారు.

IPLలో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా ఆయన చేర్చారు. ఓ విచారణ అధికారిగా తాను IPL బెట్టింగ్ స్కామ్‌ను బయటపెట్టానని ఆ పిల్‌లో సంపత్ చెప్పారు. IPL బెట్టింగ్ స్కామ్‌లో బుకీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈ అధికారిని నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేశారు.
అయితే ఈ ఇయర్ మార్చిలో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టేయడంతో మళ్లీ విధుల్లో చేరారు. తమిళనాడు పోలీస్ క్యూ బ్రాంచ్‌లో సంపత్ ఎస్పీగా పనిచేస్తున్నారు.

తాను IPL పై నిషేధం విధించాలని కోరడం లేదని, అయితే కొత్త సీజన్ మొదలయ్యే ముందే బెట్టింగ్ నిరోధించే ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే తన వినతి అని సంపత్ ఆ పిల్‌లో స్పష్టంచేశారు. BCCI ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా IPL నిర్వహించకూడదంటూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. IPL 11వ సీజన్ ఏప్రిల్ 7 నుంచి మొదలవనున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy