IPL – ఇండియ‌న్ పెన్ష‌న్ లీగ్‌

iplఐపీఎల్…ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌…క్రికెట్ క్రీడ‌ను మ‌రో ఎత్తుకు తీసుకెళ్లిన టోర్నీ. కొన్ని వంద‌ల కోట్ల‌తో ముడిప‌డిన గేమ్‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే  క్రికెట్ పేరుతో వేల కోట్ల‌లో జ‌రిగే వ్యాపారం. ఐపీఎల్ 2008లో ప్రారంభ‌మైన నాటినుంచి ప్ర‌తీ సంవ‌త్స‌రం కొత్త హంగుల‌తోనే ముందుకొస్తోంది. ఆట‌గాళ్ల వేలం పాట నుంచి క్రికెట‌ర్స్ బ‌రిలో దిగేవ‌ర‌కు అంతా డ‌బ్బుతో ముడిప‌డిన‌దే.

2014లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీట‌ర్సన్‌ను రూ.9కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆ ఏడాది ఢిల్లీ చివ‌రి స్థానంలో నిలిచింది. 2015 ఐపీఎల్‌లో ఇదే కెవిన్ పీటర్స‌న్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.2 కోట్లు పెట్టి కొన్నది. క‌నీసం ఆడే అవ‌కాశం కూడా పీట‌ర్స‌న్‌కు ద‌క్క‌లేదు. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆ మ‌ధ్య కాలంలో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో అందివ‌చ్చిన ఒక‌టో రెండో అవ‌కాశాల‌ను చ‌క్క‌గా వినియోగించుకోవ‌డంతో  ఢిల్లీ డేర్ డెవిల్స్ యువ‌రాజ్ సింగ్‌పై రికార్డు స్థాయిలో రూ.16 కోట్లు వెచ్చించింది. కానీ ఆ సీజ‌న్‌లో యువ‌రాజ్ సింగ్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. అంత‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు యువ‌రాజ్‌ను రూ.14 కోట్లతో సొంతం చేసుకుంది. మ‌రోవైపు బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తిక్‌పై రూ.10.5 కోట్లు వెచ్చించింది. అయితే దినేష్ కార్తీక్ ఆడిన మ్యాచ్‌ల‌లో ఎక్కువ‌గా డ‌కౌట్ అయ్యాడు.

అయితే ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తి మారింది. యాజ‌మాన్యాలు  కొత్త‌గా ఆలోచించ‌డం మొద‌లు పెట్టాయి. బ్యాట్స్‌మెన్ ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే..అంత‌ర్జాతీయ దేశ‌వాళీ క్రికెట్‌లో ఈ మ‌ధ్య‌కాలంలో ఆయా ఆట‌గాళ్ల ప్ర‌దర్శ‌న‌ను దృష్టిలో ఉంచుకుని క్రికెట‌ర్స్‌ను కొనుగోలు చేశాయి. అంత పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు వెచ్చించినా, స‌ద‌రు ఆట‌గాళ్లు ప‌రుగులు చేయ‌క‌పోవ‌డంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. అంత‌కంటే యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించ‌డం ఉత్త‌మ‌మైన ఆలోచ‌న అని భావించాయి. కొత్త ఆట‌గాళ్ల‌ను త‌క్కువ ధ‌ర‌తోనే కొని వారు త‌మ స‌త్తాను చాటే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. ఇక స్టార్ ఆట‌గాళ్ల‌పై వెచ్చించిన డ‌బ్బు వారికి పెన్ష‌న్ డ‌బ్బులుగా పనికొస్తుంద‌ని యాజ‌మాన్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇప్ప‌టికైనా ఆల‌స్యం చేయ‌కుండా ఐపీఎల్‌లో ఆయా యాజ‌మాన్యాలు కొత్త ఆట‌గాళ్లకు అవ‌కాశం ఇవ్వ‌డంపై మాజీ క్రికెట‌ర్లు, క్రీడా పండితులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy