IPL కోసమేనా..: కోహ్లీ న్యూ హెయిర్ స్టైల్

Virat-Kohliస్పోర్ట్స్ స్టార్స్ ఎప్పటికప్పుడు తమ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌ను మారుస్తూ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంటారు. ఇలా ఓ సరికొత్త ఫ్యాషన్‌ని సెట్ చేయడంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే భిన్న హేయిర్‌ స్టైల్‌, టాటూలతో రాక్‌స్టార్‌ను తలిపించే కోహ్లి మరోసారి తన హెయిర్‌ స్టైల్‌ను మార్చేశాడు. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. స్టైల్‌ మాస్టర్‌ ఆలిమ్‌ మాలిక్‌ చేసిన గొప్ప కటింగ్‌ అనే క్యాఫ్షన్‌తో ఫొటోను ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. గతంలోనే కోహ్లి కటింగ్‌ను అనుసరించిన అభిమానులకు తాజా కటింగ్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఈ నెలలోనే కోహ్లి తన భుజంపై కొత్త టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్ అనంతరం దొరికిన విశ్రాంతిని ఆస్వాదిస్తున్న కోహ్లి.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే IPL కోసం సన్నదమవుతున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy