IPL క్వాలిఫయర్-1 : చెన్నై టార్గెట్-140

SRHIPL సీజన్ -11 క్లైమాక్స్ కి చేరుకుంది. మంగళవారం (మే-22) ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. రైజర్స్ బ్యాట్స్ మెన్లలో కార్లోస్ బ్రాత్ వైట్ (43) తప్పా..మిగతా ప్లేయర్లూ రాణించలేకపోయారు.

చెన్నై బౌలింగ్ లో బ్రావో (2) తీయగా..జడేజా, ఠాకూర్, లుంగి ఎంగిడి, చాహర్ తలో వికెట్ తీశారు. వరుస విజయాలతో టాప్ లో నిలిచిన హైదరాబాద్ కి ఇవాళ్టి మ్యాచ్ కీలకం కానుంది. బౌలింగ్ తో రాణిస్తున్న హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌ లో గెలిచిన టీమ్ డైరెక్ట్ గా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఓడిపోయిన టీమ్‌ కు మరో అవకాశం ఉంటుంది. బుధవారం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తొలి క్వాలిఫయర్‌ లో ఓడిన టీమ్ ఆడుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy