IPL: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ ల టైమింగ్స్ మార్పు

iplక్రికెట్  అభిమానులు ప్రస్తుతం IPL మ్యాచ్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి వరకు జరుగుతున్న  మ్యాచ్ లు ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. స్లో ఓవర్ రేట్‌ల కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఒక్కోసారి రాత్రి 12గంటల వరకూ సాగుతున్నాయి. దీంతో కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్, ఫైనల్ సమయాల్లో మార్పు చేసినట్లు చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. సాధారణంగా రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయన్నారు. గ్రౌండ్ల నుంచి అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లే అభిమానులు తీవ్రంగా ఇబ్బందులు పడటంతో పాటు… టీవీల్లో చూసేవాళ్లు కూడా ఉదయాన్నే పనులకు వెళ్లడం కష్టమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్లా తెలిపారు. రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి. మే 23, 25న ఈ రెండు మ్యాచ్‌లో జరుగుతాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో మే 22న జరిగే క్వాలిఫయర్ 1తోపాటు మే 27న జరిగే ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy