IPL ఫైనల్ : చెలరేగిన చెన్నై..వాట్సన్ సెంచరీ

shane
IPL సీజన్-11 ఫైనల్ మ్యాచ్ లో దూకుడుగా ఆడాడు చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్. ఆదివారం (మే-27) ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 6 వికోట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై ఆరంభంలో తడబడినా తర్వాత పుంజుకుంది. ఓపెనర్ షేన్ వాట్సన్ అద్భుతమైన ఆటతో సెంచరీ పూర్తి చేశాడు. పవర్ ప్లేలో 35 రన్స్ మాత్రమే చేసిన చెన్నై, ఆ తర్వాత మెరుపు షాట్స్ తో చెలరేగాడు వాట్సన్.  51 బాల్స్ లో 8 సిక్సులు, 7 ఫోర్స్ తో ఒక్కడే వీర విహారం చేశాడు. ప్రస్తుతం 16.3 ఓవర్లు ముగిసేసమయానికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy