IPL బెట్టింగ్ సంచలనం : సల్మాన్ ఖాన్ తమ్ముడికి నోటీసులు

salmanIPL – 2018 అలా ముగిసిందో లేదో.. ఇలా బెట్టింగ్ మాఫియా లింక్ బయట పడింది. మామూలుగా అయితే అందరూ లైట్ తీసుకునేవారు.. బాలీవుడ్ టాప్ హీరో తమ్ముడికి బెట్టింగ్ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే వార్త బయటకు రావటంతో.. క్రికెట్ తోపాటు.. బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ఉన్నాడంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి.

IPL-2018 బెట్టింగ్ కేసులో సల్మాన్ సోదరుడు నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్ కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. అంతర్జాతీయ బుకీలతో అర్భాజ్ ఖాన్ కు సంబంధాలున్నాయంటూ వివరణ కోరారు. IPL సమయంలో అర్భాజ్ పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై కేంద్రంగా భారత్ కు చెందిన టాప్ బుకీ సోనూ మలాడ్, ఇతరులు ఈ బెట్టింగ్ రాకెట్ ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం టాప్ బుకీ సోనూని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనూకి.. దావూద్ ఇబ్రహీంతో కూడా సంబంధాలున్నట్లు తెలుస్తుంది.

2012 IPL సమయంలో ఓ శ్రీలంక ప్లేయర్ కు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం రూ.10 కోట్లు ఇచ్చిన కేసులో సోనూ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది. సోనూని పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో.. అతడి ఫోన్ లో అర్భాజ్ ఖాన్ వివరాలతో ఫొటో ఉండటంతో విచారణకు హాజరవ్వాలంటూ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు సమన్లు జారీ అయ్యాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy