IPLమ్యాచ్‌: రాజస్థాన్ పై 6వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్

kl-rahulఇండోర్ లోని వోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించింది. ఆదివారం(మే-6) జరిగిన IPL  మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్… కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్ తో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్ 54 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో  84 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. IPL లో రాహుల్ కు ఇదే అత్యధిక స్కోరు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy