
IPL-2018 మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక బాల్ మిగిలి ఉండగానే పూర్తి చేసింది. బ్రావో (68), కేదార్ జాదవ్(24) పరుగుల ఉత్తమ స్కోరుతో చెన్నై విజయం సాధించింది.
ముంబై బౌలర్లు మార్కాండే, హార్థిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు తీసుకోగా, మిగితా బౌలర్లు ఒక్కో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లూయిస్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా..రోహిత్ శర్మ(15), ఇషాన్ కిషాన్(40), సూర్యకుమార్ యాదవ్(43), కృనాల్(41), హార్దిక్- 22 నాటౌట్ గా నిలిచాడు.
చెన్నై బౌలర్లలో షేన్ వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహీర్‌లకు తలో వికెట్ తీసుకున్నారు.