IPL మ్యాచ్-11 : బెంగళూరుపై రాజస్థాన్ విక్టరీ

match
IPL సీజన్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-15) బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 19 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది రాజస్థాన్. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితమైంది. ఛేదనలో ఆ టీమ్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (57; 30 బంతుల్లో 7×4, 2×6) మినహా మరెవరూ హాఫ్ సెంచరీ చేయలేదు. అయితే 126 పరుగులకు 5 నష్టపోయి ఘోర పరాజయం పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్న కోహ్లీసేనను చివర్లో మన్‌దీప్‌ సింగ్‌ (47 నాటౌట్‌; 25 బంతుల్లో 6×4, 1×6), వాషింగ్టన్‌ సుందర్‌ (35; 19 బంతుల్లో 1×4, 3×6) విలువైన పరుగులు చేసి ఆదుకున్నారు. చివర్లో బౌండరీలు సాధించి 198 వరకు తీసుకొచ్చారు.

శాంసన్‌ వీరవిహారం..

కెప్టెన్‌ అజింక్యా రహానే 36(20 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్సు) వికెట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌ కొడితే.. సిక్సరే.. అన్నట్లు చెలరేగాడు. ఈ దశలో 34 బంతుల్లో 5 సిక్సులతో శాంసన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా పది సిక్సులతో వీరవిహారం చూపించాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, స్ట్రెయిట్‌ డ్రైవ్‌లతో ఔరా అనిపించాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy