IPL మ్యాచ్-20 : హైదరాబాద్ టార్గెట్-183

matchIPL సీజన్ 11లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-22) చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ధోనీ సేనకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బౌలర్లు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ ప్రారంభంలోనే విధ్యంసకవీరుడు వాట్సన్ ఔట్ కావడంతో స్కోర్ బోర్డు కదలలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ తో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ కు చుక్కలు చూపించారు.

లైన్ అండ్ లెంగ్త్‌ తో పదునైన బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. పేసర్లు, స్పిన్నర్లు బౌలింగ్‌ తో విజృంభించగా.. ఫీల్డింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.  దీంతో ఈ సీజన్‌లో పవర్‌ప్లే ముగిసే సరికి అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన తొలి జట్టుగా చెన్నై అప్రతిష్టను మూటగట్టుకుంది.  సన్‌ రైజర్స్‌ బౌలర్లు భువనేశ్వర్‌, బిల్లిస్టేన్‌ లేక్‌, రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్‌ ల కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల కోసం చెన్నై బ్యాట్స్‌ మన్‌ లు తెగ ఇబ్బంది పడ్డారు.

అయితే సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు చెన్నై ఆటగాళ్లు నానా కష్టాలు పడ్డారు. 32 పరుగుల వద్దే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన చెన్నైకి రైనా, రాయుడుల జోడీ అండగా నిలిచింది. మూడో వికెట్‌కి 112 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకుంది. అంబటి రాయుడు 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు బాది స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే సిద్ధార్త్ కౌల్ వేసిన 17వ ఓవర్‌లో రాయుడు అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అయినప్పటికీ రైనా పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేసి జట్టు స్కోర్‌ లో కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సన్‌ రైజర్స్ బౌలింగ్‌లో భువనేశ్వర్, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy