IPL మ్యాచ్-22 : ఢిల్లీ టార్గెట్-144

IPL సీజన్-11లో భాగంగా సోమవారం (ఏప్రిల్-23) ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటంగ్ ముగిసింది. మ్యాచ్‌ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత ఫీల్డింగ్ చేసేందుకు ఎంచుకుంది. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్‌ కు దిగిన పంజాబ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ శ్రేయస్ అయ్యార్‌ కి క్యాచ్ ఇచ్చి పెవిలియ్న చేరాడు. ఆ తర్వాత కాస్త దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ ప్లంకెట్ వేసి ఐదో ఓవర్ మూడో బంతికి భారీ షాట్‌ కు ప్రయత్నించి అవేశ్‌ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

ఈ క్రమంలో కరుణ్ నైర్, మయాంక్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే ప్లంకెట్ బౌలింగ్‌లో మయాంక్(21) క్లీన్ బౌల్డ్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మళ్లీ ప్లంకెట్ బౌలింగ్‌లో కరుణ్ నైర్‌(34) కూడా డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 143 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో ప్లంకెట్ 3, బౌల్ట్, అన్వేష్ చెరి రెండు, క్రిస్టెయిన్ 1 వికెట్ తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy