IPL మ్యాచ్-24 : బెంగళూరుపై చెన్నై విక్టరీ

ipl-24రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్‌ కింగ్స్‌ . చివరి ఓవర్లో చెన్నై విజయానికి 16 పరుగుల కావల్సి ఉండగా.. బ్రేవో ఫోర్‌, సిక్స్‌ సాధించగా..ధోని విన్నింగ్‌ షాట్‌తో  రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు. దీంతో గురు-శిష్యుల పోరులో గురువే పై చేయి సాధించాడు. ఇక టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ సఫారి ద్వయం డికాక్‌ 53(37 బంతుల్లో 1 ఫోర్‌,4 సిక్స్‌లు), 68(30 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సులు)ల చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది

206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. ఆదిలోనే ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(7) వికెటన్‌ను కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన సురేశ్‌ రైనాతో మరో ఓపెనర్‌ రాయుడు ఆచితూచి ఆడాడు. జట్టు స్కోర్‌ 50 పరుగుల వద్ద రైనా(11) ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే చహల్‌ బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌(9) ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో స్టంప్‌ ఔట్‌గా.. ఆ వెంటనే జడేజా(3) క్లీన్‌బౌల్డ్‌గా నిరాశ పరిచాడు. దీంతో చెన్నై 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా క్రీజులోకి వచ్చిన ధోనితో అంబటి రాయుడు వేగంగా పరుగులు చేశాడు.

ఈ క్రమంలో 40 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో రాయుడు అర్ధ సెంచరీ సాధించాడు. మరి కొద్ది సేపటికే ధోనిసైతం 29 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సులతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉమేశ్‌ యాదవ్‌ జారవిడిచాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో చెన్నై విజయం దిశగా పయనించింది. 18 ఓవర్‌లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను క్యాచ్‌ జారవిడిచిన ఉమేశ్‌ యాదవే రనౌట్‌ చేశాడు. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చి బ్రేవో14( 7 బంతులు,1ఫోర్‌,1సిక్స్‌) సాయంతో ధోని70( 1 ఫోర్‌, 7 సిక్స్‌లు,నాటౌట్‌) విజయాన్నందించాడు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy