IPL మ్యాచ్ -37 : కోల్ కతాపై ముంబై గ్రేట్ విక్టరీ

mumbaiIPL-సీజన్-11లో భాగంగా ఆదివారం (మే-6) వాంఖడే వేదికగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో గ్రేట్ విక్టరీ సాధించింది ముంబై. ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన కోల్ కతా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడిపోయింది.

కోల్ కతా ప్లేయర్లలో.. రాబిన్ ఉతప్ప(54: 35 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), నితీశ్ రాణా(31: 27 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్), దినేశ్ కార్తీక్(36 నాటౌట్ 26 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య(2/19), మెక్లీనగన్(1/30) గొప్పగా బౌలింగ్ చేశారు.

అంతకుముందు ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. కోల్‌ కతా నైట్ రైడర్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్(59: 39 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), ఎవిన్ లెవిస్(43: 28 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) ఆరంభంలో మెరుపు బ్యాటింగ్‌తో ముంబయిని పటిష్ఠస్థితిలో నిలిపారు. ఆఖర్లో తనదైన శైలిలో చెలరేగిన పాండ్య(35 నాటౌట్: 20 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) జట్టు స్కోరును 180 దాటించాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy