IPL రికార్డ్ : కోహ్లీ ఫస్ట్ బ్యాట్ప్ మెన్

KOHLIరికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPL సీజన్ -11లో భాగంగా సోమవారం (మే-14) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును సొంత చేసుకున్నాడు కోహ్లీ. IPL ఐదు సీజన్లలో 500 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన ఫస్ట్ బ్యాట్స్‌ మెన్‌ గా కోహ్లి నిలిచాడు. కింగ్స్ పంజాబ్‌ తో మ్యాచ్‌ లో 48 రన్స్ చేసిన విరాట్.. ఈ సీజన్‌ లోనూ 500 రన్స్ మార్క్ దాటాడు.

సీజన్ మొదలయ్యే ముందు నాలుగు సీజన్లలో 500 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన వాళ్లలో వార్నర్‌ తో కలిసి కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌ లోనూ 500 రన్ మార్క్ దాటి వార్నర్‌ ను వెనక్కి నెట్టాడు. ఈ ఇద్దరి తర్వాత రైనా, గేల్, గంభీర్ మూడేసి సార్లు 500 కన్నా ఎక్కువ పరుగులు చేయగా.. సచిన్ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. కోహ్లి ఫస్ట్ టైం 2011 సీజన్‌ లో ఈ ఫీట్‌ ను అందుకున్నాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచుల్లో 557 పరుగులు చేశాడు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy