IPL-10: డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ విక్టరీ

ipl-hydఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 15 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగుల చేసింది. 192పరుగల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంబించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసి 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెంగళూరు బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ (70), విలియమ్సన్ (89) అద్భుతంగా రాణించారు. కాగా క్రిస్ మోరిస్ 4 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బ్యాట్స్ మెన్లు శ్రేయాష్ అయ్యార్ హాప్ సెంచరీ సాధించారు. 31 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్ లు బాది 50 పరుగులు చేసి చివరి వరకు నిలిచినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయాడు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ 2, సిర్దార్థ్ కౌల్, యువరాజ్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy